SEB Raids In Cheerala Ward Secretariat : అక్కడా.. ఇక్కడా దాచి పెడితే అందరికి తెలిసిపోతుందనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని రామ్ నగర్ వార్డు సచివాలయం కింద.. భూమిలో బెల్లం ఊటను అక్రమార్కులు దాచిపెట్టారు. విషయం తెలుసుకుని దాన్ని తవ్వి తీసిన ఎస్ఈబి అధికారులు అవాక్కయ్యారు.
చీరాల రామానగర్ లో ఎస్ఈబి శాఖ అధికారిణి బిందుమాధవి ఆదేశాల మేరకు నాటుసారా స్థావరాలపై పోలీసులు, ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. వార్డు సచివాలయం భవనం కింద 20 లీటర్ల నాటుసారా, గుంట తీసి పాతి ఉంచిన డ్రమ్ముల్లో, సమీపంలోని విద్యుత్ పరివర్తకం వద్ద భూమిలో పాతి ఉంచిన మొత్తం రెండుచోట్ల రెండువేల లీటర్ల బెల్లం వూటలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను దహనం చేశారు.
ఈ దాడుల్లో ఎస్ఈబి అధికారులతో పాటు చీరాల రెండో పట్టణ పోలీసులు పాల్గొన్నారు. మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతంలో తనిఖీలు చేయనున్నట్లు ఎస్ఈబీ కమిషనర్ అవులయ్య తెలిపారు.
ఇదీ చదవండి :
Agoras at Kadapa: కడప ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమైన అఘోరాలు..!