ప్రకాశం జిల్లా త్రిపురాంతాకం మండలంలో నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. సంఘంతండాలో 20 లీటర్ల నాటుసారాతో పాటు తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి: బొమ్మ జీపు అడిగితే.. నిజమైనదే చేసి ఇచ్చిన తండ్రి
బెస్తవారిపేట మండలం పగుళ్ల అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ సిబ్బంది దాడి చేశారు. తయారీకి సిద్ధంగా ఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సీఐ సోమయ్య, ఎస్సై మహబూబ్ వలితో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన కారు.. 48 గొర్రెలు మృతి