ETV Bharat / state

కరోనా రోగులకు అండగా... శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్‌ - ongole latest news

కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి పరిస్థితి ఏంటి..? ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు వైరస్‌ సోకితే దిక్కెవరు..! బయటకు వెళ్లి సరకులు తెచ్చే వాళ్లే లేనివారికి ఆకలి తీరేదెలా? అలాంటి కొవిడ్‌ రోగులకు అండగా మేమున్నామంటూ నేరుగా వాళ్ల ఇళ్లకే భోజనం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటోంది ఒంగోలుకు చెందిన శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్‌.

శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్‌
శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్‌
author img

By

Published : May 23, 2021, 7:08 AM IST

శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్‌

ఒంగోలు మంగమూరు రోడ్డు సమీపంలోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఆహారం అందిస్తూ ఆదుకుంటోంది. కరోనా పాజిటివ్‌ వచ్చి స్వల్ప లక్షణాలతో ఇంట్లో ఉన్న వారికీ, బయటకు వెళ్లి సరకులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికీ ఇంటింటికీ వెళ్లి భోజనం అందిస్తూ సేవా సమితి సభ్యులు ఉదారత చాటుకుంటున్నారు. సేవా సమితి సభ్యులంతా చిరు ఉద్యోగులు, విద్యార్థులే కావడం విశేషం. సుమారు రెండు వారాలుగా రోజుకు 215 మంది రోగులకు ఆహారం అందిస్తున్నారు.

భోజనం కావాలనుకుంటున్న కరోనా రోగులు ఉదయం 8 గంటల లోపు వివరాలు, చిరునామా చెబితే మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తామని సేవాసమితి సభ్యులు చెబుతున్నారు. రోడ్డు పక్కనున్న నిరాశ్రయులకు సాయంత్రం టిఫిన్‌ అందిస్తామని వివరించారు. ఆహారం కావాలనుకుంటున్న కరోనా బాధితులు 8501 8383 86 నెంబర్‌కి సమాచారం ఇవ్వాలని సేవాసమితి సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి:

హగ్స్​, షేక్​హ్యాండ్స్​తో శ్వేతసౌధం​లో మళ్లీ పాతరోజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.