ETV Bharat / state

నీళ్లు అడిగినందుకు వ్యక్తిపై దాడి...చికిత్స పొందుతూ మృతి - ప్రకాశం జిల్లాలో మంచినీళ్లు అడిగాడని పారిశుద్ధ్య కార్మికుడిపై దాడి

ప్రకాశం జిల్లా పిట్టువారిపాలెంలో దాడికి గురైన పారిశుద్ధ్య కార్మికుడు బుచ్చయ్య.. చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంచినీళ్లు అడిగినందుకు బుచ్చయ్యపై..పక్కింటి వారు దాడిచేశారు. ఈ దాడిలో బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

మంచినీళ్లు అడిగినందుకు వ్యక్తిపై దాడి...చికిత్స పొందుతూ బాధితుడు మృతి

author img

By

Published : Aug 11, 2020, 11:28 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామంలో దాడికి గురైన పారిశుద్ధ్య కార్మికుడు బి.బుచ్చయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. పిట్టువారిపాలెం పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా బుచ్చయ్య పని చేస్తున్నారు. మంచినీళ్ల కోసం ఈ నెల 8వ తేదీన బుచ్చయ్య తన ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో వెంకటేశ్వర్లు ఇంట్లో ఆయన కుమార్తె ఒక్కరే ఉన్నారు. తాము ఇంట్లో లేనప్పుడు తమ కుమార్తెను ఎందుకు మంచినీళ్లు అడిగావని బుచ్చయ్యపై వెంకటేశ్వర్లు, అతని బంధువులు దాడిచేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బుచ్చయ్యను ముందుగా చీరాల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి చీరాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుచ్చయ్య మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఈపురుపాలెం పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : తెదేపా కార్యకర్త అరెస్టుపై డీజీపీకి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.