అనోన్యంగా కలిసున్న ఆ దంపతులు మృత్యువులోనూ వీడలేదు. రోడ్డ ప్రమాదంలో ఇద్దరూ ఒకే సారి మృత్యుఒడిని చేరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీ నారాయణమ్మ దంపతులు ఇంట్లోకి సరుకులు తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై మార్కాపురం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోమటికుంట వద్దకు రాగానే జాతీయ రహదారి పై అటుగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ వీరి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య లక్ష్మీ నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త వెంకటేశ్వర రెడ్డి వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఇదీ చదవండీ.. డబ్బులు కోసం సారా విక్రయం.. తరలించేందుకు బైక్ల చోరీ...!