Road Accident: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తక్కెళ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. పామూరు నుంచి కనిగిరి వైపునకు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం రోడ్డు పక్కన వెళ్తున్న చెంచయ్య(65)అనే వృద్ధుడిని ఢీ కొనగా అతను మరణించాడు. తర్వాత ఆదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆటోలో 10మంది ప్రయాణికులు ఉండగా వారిని స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: