ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ క్లీనర్‌గా పని చేసే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామ వాసిగా గుర్తించారు. ఈ ఘటన పై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి