రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకున్ని వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు బంధువులు. అయితే ఆ యువకుడు మద్యం మత్తులో ఉండడం వల్ల వైద్యులకు కాసేపు చుక్కలు చూపించాడు. అతనికి వైద్యం చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు కాళ్ళు చేతులు పట్టుకొని వైద్యం ముగించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం సమీపంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శేఖర్ అనే యువకుడు పూటుగా మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. గాయపడిన మరో ఇద్దరికి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్సనందించారు.
ఇదీ చదవండి: రెండు రోజుల కిందట తప్పిపోయింది..శవమై తేలింది