ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు టైర్ పంచర్ కావడం వల్ల వంతెనపై నుంచి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మృతులు దోర్నాలకు చెందిన బాషా హుస్సేన్, రఫీగా పోలీసులు గుర్తించారు. దోర్నాల నుంచి పొరుమామిళ్ల వెళుతుండగా నికరంపల్లి వద్దకు రాగానే ముందు టైర్ పంచర్ అయి కారు బోల్తా పడింది. దీంతో వంతెనపై నుంచి కారు బోల్తా పడింది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చూడండి