ETV Bharat / state

Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం ! - Road accident at pakasham latest news

మరో గంటలో పెళ్లిబాజాలు మోగాల్సిన కుటుంబంలో.. రోడ్డు ప్రమాదం పెనువిషాదం నింపింది. దేవుడి సన్నిధిలో తలపెట్టిన పెళ్లి వేడుకకు ట్రాక్టర్‌పై వెళుతుండగా మృత్యువు దారికాచింది! ప్రకాశం జిల్లా పొదిలి సమీపంలోని నరసింహస్వామి కొండపై జరిగిన ప్రమాదంలో.. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !

author img

By

Published : Feb 19, 2022, 5:59 PM IST

మరో గంటలో పెళ్లి. పెళ్లి కుమార్తె తరఫు బంధువులంతా ఆనందంగా మండపానికి బయల్దేరారు. ఇంతలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమార్తెతో పాటు బంధువులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం

ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం చాకిచర్లకు చెందిన వధువుకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. పొదిలి సమీపంలోని నరసింహ స్వామి కొండపై 11 గంటలకు ముహుర్తం ఖరారు చేశారు. ముహుర్తం సమయం దగ్గరపడటంతో చాకిచర్ల నుంచి ట్రాక్టర్​లో పెళ్లి కుమార్తెతో పాటు బంధువులు పెళ్లి మండపానికి బయల్దేరారు. ఘాట్ రోడ్డు, రహదారి సరిగా లేకపోవడం, ములుపులతో కొండ సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో దేవమ్మ, కమలమ్మ అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో పెళ్లి కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంతో పెళ్లి తాత్కాలికంగా నిలిచిపోయింది.

కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ప్రమాదం జరగటంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి

కన్నతండ్రిపై కుమారుడి కర్కశత్వం.. ఆస్తి విషయమై విచక్షణారహిత దాడి !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.