ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కఠారి సుబ్బారావు రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. రైతు కుటుంబంలో పుట్టిన సుబ్బారావుకు చిన్నప్పటినుంచి సేద్యంపై మక్కువ. అందుకే పదవీ విరమణ తరువాత సేద్యం వైపు అడుగులు వేశారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా, తక్కువ ఖర్చుతో సత్ఫలితాలను సాధిస్తున్నారు.
గ్రామ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు...
చీడపీడల నివారణకు సుబ్బారావు స్వయంగా సేంద్రీయ ఎరువు తయారు చేసుకుంటున్నారు. తొలుత వరితో మొదలైన సాగు మెల్లగా చిరుధాన్యాలు, వాణిజ్యపంటలకూ విస్తరించింది. ప్రకృతి సాగు వల్ల నాణ్యమైన ఆహార ఉత్పత్తులు లభించి ఆరోగ్యాన్నీ కాపాడుతున్నాయని సుబ్బారావు చెబుతున్నారు. తన ఊళ్లోని ఇతర రైతులూ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. పోలియో బాధిస్తున్నా వ్యవసాయంపై సుబ్బారావు చూపిస్తున్న మక్కువను గ్రామస్థులందరూ అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రకృతి సేద్యం... ప్రజలకు అమృతం..!