ప్రకాశం జిల్లాలోని కంభం మండలం నడింపల్లి గ్రామంలో రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారని పలువురు ఆరోపించారు. భక్తి పాటలు వినిపించాల్సిన చోట.. ఐటెంసాంగ్లు, డీజీ పాటల మోత మోగటంతో నిజమైన భక్తులు మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికి రూల్స్, పర్మిషన్స్ మాట్లాడే పోలీసులు.. ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: