ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం దొనకొండ మండలం. సాగునీరు కాదే తాగునీటికి కూడా కటకటలాడే ప్రాంతం ఇది. వర్షాధారంతో ఆరుతడి పంటలు సాగుతోనే వారు జీవనం సాగిస్తుండగా.. మండలాలలో ఉన్న పలు గ్రామాల్లో ప్రభుత్వ స్థలం మాత్రం విస్తారంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో కొండలు, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తారనే ఓ ప్రచారం సాగింది. దాంతో చాలా మంది ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసారు. తీరా రాజధాని నిర్మాణం మాత్రం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ముంపు ప్రాంతమని..రాజధాని మార్పు అనే ప్రకటనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవకాశంగా మారింది. ఈ ప్రకటనలను ఆసరాగా చేసుకొని ....దొనకొండ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పొలాలు వేటను ప్రారంభించారు... గతంలో ఎకరాకు రూ. 10, నుంచి రూ. 20 లక్షలు రూపాయలు చేసే భూములు ఇప్పుడు ఏకంగా రూ. 30 లక్షల నుంచి మొదలై రూ.40 లక్షలు, 80 లక్షల వరకు కొనేందుకు బేరాలు పెడుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి జోరుగా రాక
గత కొద్ది రోజులుగా తెలంగాణా రాష్ట్రం నుంచే కాకుండా నంద్యాల, కడప, విజయవాడ, గుంటూరు ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడకు చేరుతున్నారు. బేరం కుదిరితే నాల్గొవ వంతు అడ్వాన్సు ఇస్తూ.. భూములను సొంతం చేసుకుంటున్నారు. దఫా దఫాలుగా ఒప్పందం చేసుకున్న వారు వెంచర్లు, ఫెన్సింగులు, రోడ్లు, కాలువలు కూడా వేస్తున్నారు.. మరికొందరు ప్లాట్లు కూడా అమ్మేస్తున్నారు.
ప్రచారాన్ని నమోద్దు...
గుక్కెడు నీళ్లు కూడా దొరకని దొనకొండలో రాజధాని ఎలా వస్తుందని మరికొందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకే ఇలా ప్రచారం సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీన్ని నమ్ము మోసపోవద్దని పలవురు అభిప్రాయపడుతున్నారు. రాజధాని మార్పు మాట ఎలా ఉన్నా...దొనకొండ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కళకళలాడుతుంది.
ఇదీచూడండి.రాజధానిలోని రైతుల సభలో రసాభాస...