ప్రకాశం జిల్లా కనిగిరిలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గత మూడు రోజులుగా ముస్లింలు దీక్ష చేస్తున్నారు. ముస్లింల దీక్షకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుంచి సుభాస్ రోడ్ మీదుగా దీక్షా శిబిరానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నాయకులు, ముస్లిం సోదరులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టులో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలపై కేసులు పెండింగ్లో ఉండగానే కేంద్ర హోంశాఖ గెజిట్ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కడప ముస్లిమ్ ఐకాస నేతలు లీగల్ నోటీసులు పంపించారు. హోం శాఖ సెక్రెటరీకి, అదనపు సెక్రెటరీకి, ఆర్బీఐ గవర్నర్కు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని వారు ఆరోపించారు. కేంద్రం మొండి వైఖరితో అవలంబిస్తున్న విధానాలను తక్షణం ఉపసంహరించుకోవాలని లేకపోతే రాజీలేని పోరాటానికి దిగుతామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: