ETV Bharat / state

'ఏపీలో రైతాంగ పోరాట స్ఫూర్తి.. అమరావతి ఉద్యమమే నిదర్శనం' - rakesh singh tikayat support amaravathi agitation news

భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ సింగ్‌ టికాయిత్‌.. అమరావతి అన్నదాతల ఉద్యమాన్ని కొనియాడారు. ఏపీలో రైతాంగ పోరాట స్ఫూర్తి ఉందనీ... దానికి అమరావతి ఉద్యమమే నిదర్శనమని కితాబునిచ్చారు. దిల్లీ రైతుల పోరాటాన్ని దేశమంతా విస్తరించాలని పిలుపునిచ్చారు.

rakesh singh tikayat
రాకేశ్‌ సింగ్‌ టికాయిత్
author img

By

Published : Apr 20, 2021, 7:36 AM IST

ఏపీలో రైతాంగ ఉద్యమ స్ఫూర్తి బలంగా ఉంది.. అమరావతికి భూములిచ్చిన అన్నదాతలు నిర్విరామంగా పోరాడుతూనే ఉన్నారని దిల్లీ రైతాంగ పోరాటానికి సారథ్యం వహిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ సింగ్‌ టికాయిత్‌ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో 144 రోజులుగా రైతాంగం చేస్తున్న పోరాటానికి రైతులు, కార్మికులతోపాటు ప్రజలంతా మద్దతిచ్చి దేశవ్యాప్త ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి, ఏపీ కిసాన్‌మోర్చాల ఆధ్వర్యంలో ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన విజయవాడ, ఒంగోలుల్లో సోమవారం నిర్వహించిన కార్మిక- కర్షక సదస్సుల్లో టికాయిత్‌ మాట్లాడారు. ‘వ్యవసాయ రంగాన్ని అంబానీ, అదానీ తదితర బడా కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను వారికి బానిసలుగా మార్చడమే ఈ నల్లచట్టాల ఉద్దేశం. మండీలు, కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో వ్యవసాయ ఉత్పత్తులు భద్రపర్చుకోలేని పరిస్థితులు వచ్చాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది’ అన్నారు. దేశాన్ని పాలిస్తున్న ప్రైవేట్‌ శక్తుల కోసం తీసుకొచ్చిన ఈ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడదామన్నారు. దిల్లీలో సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా జిల్లా, మండల కేంద్రాల్లోనూ ట్రాక్టర్లతో రైతులు ఉద్యమించాలని, మహిళలూ వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో అన్ని రంగాల సమస్యలపైనా పోరాడతామని ఆయన ప్రకటించారు.

నల్లచట్టాలతో 81 కోట్ల మందికి రేషన్‌ రద్దు!

అయిదు నెలలుగా దిల్లీలో సాగుతున్న పోరాటంలో 370 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో చలనం లేదని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేసీ) జాతీయ అధ్యక్షుడు అశోక్‌ ధావలె మండిపడ్డారు. ‘కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 4లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల వారే ఎక్కువమంది. వ్యవసాయ నల్లచట్టాలు అమల్లోకి వస్తే 81 కోట్ల మందికి అతి తక్కువ ధరలకే ఇస్తున్న రేషన్‌ రద్దవుతుంది. ఆకలి చావులు మరింత పెరుగుతాయి. కరోనా కష్టకాలంలో దేశ ప్రజల జీవనం అస్తవ్యస్తమైతే.. అంబానీ, అదానీల ఆస్తులు మాత్రం 50 శాతం పెరిగాయి’ అని ధ్వజమెత్తారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం కార్మికులు, కర్షకులు, సామాన్యులను మరింత దారిద్య్రంలోకి నెడుతోందని ఏఐకేఎస్‌ పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షులు బల్కరణ్‌ సింగ్‌ బ్రార్‌ విమర్శించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలన్నారు.

విశాఖ ఉక్కు- దేశ ప్రజల హక్కు

‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని ‘విశాఖ ఉక్కు- దేశ ప్రజల హక్కు’గా మారుస్తామని ఏఐఏడబ్ల్యూ జాతీయ అధ్యక్షుడు బి.వెంకట్‌ అన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి దేశంలోని 500 కార్మిక సంఘాలు మద్దతిస్తాయని చెప్పారు. వ్యవసాయ చట్టాలపై పోరాడకపోతే ఏపీ సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు దేశద్రోహులుగా మిగిలిపోతారన్నారు. రాష్ట్ర జీడీపీలో 34 శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తుందని, అలాంటి రైతులను గాలికొదిలేయడం సరికాదన్నారు. మోదీ గద్దె దిగటమో.. రైతాంగ చట్టాలు రద్దవడమో ఏదో ఒకటి జరిగేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతాంగ పోరాటానికి మద్దతిచ్చేంద]ుకు వడ్డే శోభనాద్రీశ్వరరావు కుమార్తె కొడాలి వెంకటలక్ష్మి అన్నపూర్ణ సేకరించిన రూ.6,01,000ను టికాయిత్‌కు అందజేశారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ‘రైతు గెలవాలి- వ్యవసాయం నిలవాలి’ అనే పుస్తకాన్ని అశోక్‌ ధావలే ఆవిష్కరించారు. ఒంగోలు సభలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ప్రకాశం జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

అమరావతి ఉద్యమానికి దిల్లీ రైతు నేతల మద్దతు

అమరావతి ఉద్యమానికి దిల్లీ రైతు ఉద్యమ నేతలు మద్దతు పలికారు. అమరావతి ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, రాష్ట్రం మొత్తానికి చెందినదన్నారు. దిల్లీలో పోరాడుతున్న రైతు నాయకులు సోమవారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ సింగ్‌ టికాయిత్‌, నేతలు అశోక్‌ ధావలె, బాల్కరణ్‌ సింగ్‌, ధర్మపాల్‌సింగ్‌, దిల్లీ రైతు నాయకులు విధుర్‌ సింగ్‌, ఏఐఏడబ్ల్యూ జాతీయ అధ్యక్షులు బి.వెంకట్‌ తదితరులను.. అమరావతి రైతులు, ఐకాస నాయకులు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దిల్లీ రైతు నేతలు మాట్లాడుతూ తమ పోరాటంలో అమరావతి ఉద్యమాన్ని సమ్మిళితం చేస్తామన్నారు. దిల్లీ ఉద్యమ నేతలకు అమరావతి ఐకాస నాయకులు రూ.50 వేలు విరాళం అందించారు. మీరే మా కంటే ఎక్కువ కాలంగా ఉద్యమిస్తున్నారంటూ వారు ఆ మొత్తానికి రూ.2 వేలు జత చేసి అమరావతి ఐకాస నేతలకే తిరిగిచ్చారు.

ఇదీ చదవండి:

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీపై సీఎం జగన్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.