ప్రకాశం జిల్లా కనిగిరిలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జగనన్న కాలనీలలో వర్షపునీరు చేరి చెరువును తలపించింది. కనిగిరి తెదేపా ఇంచార్జ్ ఉగ్రనరసింహారెడ్డి.. ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చుట్టూ మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు ఇల్లు నిర్మించుకొని ఎలా నివసిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. వర్షపు నీటితో మునిగిపోతున్న ఆ ప్రాంతాల్లో ఇళ్లు నిర్శించటం అసాధ్యమన్నారు. ప్రజలకు చేరువలోనే ఇంటి స్థలాలను అందించి.. అధునాతన సౌకర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
నాయకులు అవినీతి మత్తులో కూరుకుపోయి ఊరికి దూరంగా.. జనసంచారం లేని ప్రాంతంలో కాలనీలు నిర్మించడం దురదృష్టకరమన్నారు. అందువల్ల లబ్ధిదారులు సైతం ఆయా కాలనీలలో ఇల్లు నిర్మించుకోవడానికి జంకుతున్నారని ఆయన తెలిపారు. అందుకు నిరసనగా నీటితో నిండిన కాలనీలలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండీ.. మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు