crime: ప్రకాశం జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. ఓ యువకుడి పై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. కాశీరావు అనే యువకుడు ఓ టీకొట్టులో పనిచేసేవాడు. ఆ టీకొట్టు యజమాని షేక్ రబ్బానీ భార్యతో కాశీరావు వివాహేతర సంబంధం పెట్టుకొని ఇద్దరు కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. దీనిపై అగ్రహంతో ఉన్న రబ్బానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. రవిప్రియ మహల్ సమీపంలో పాన్ షాప్‌కు వచ్చిన కాశీరావును రబ్బానీ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.. తీవ్ర రక్త స్రావం అయిన కాశీరావు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రబ్బానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: లాఠీ కాఠిన్యం... విచారణ పేరుతో ఎస్సీ మహిళపై చిత్రహింసలు!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!