Addanki: అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరుతూ అఖిలపక్షం, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. అద్దంకి పట్టణంలోని ప్రముఖ వైద్యులు గొట్టిపాటి సత్యనారాయణ.. దీక్ష చేపట్టిన వారికి పూలదండ వేసి దీక్షను ప్రారంభించారు. అద్దంకి పట్టణం అభివృద్ధి చెందాలంటే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బాపట్ల నియోజకవర్గానికి అద్దంకి చాలా దూరంగా ఉందని, సరైన బస్సు సౌకర్యం కూడా లేదని తెలిపారు. సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుందని అఖిలపక్షం, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సీహెచ్. గంగయ్య, కో కన్వీనర్ ఎమ్. త్రిమూర్తులు, సంఘ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Farmers Problems: ఆరుతడి పంటలు సాగు.. నీరందక రైతుల దిగాలు