ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లోని ప్రకాశం పంతులు విగ్రహానికి.. కలెక్టర్ పోలా భాస్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అతి సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన టంగుటూరి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్లు జేవీ.మురళి, టీఎస్.చేతన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది... ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: