ప్రకాశం జిల్లా కంట్రోల్ రూమ్‌లో హోం ఐసోలేషన్, హోం క్వారంటైన్, టెలీమెడిసిన్, 104, సీసీ టీవీ తదితర విభాగాలు ఉన్నాయి. రోజుకు 150 మంది వైద్యులు, ఇతర సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. హోంఐసోలేషన్లో ఉన్న రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆశా వర్కర్లు, ఏఎన్ఏంలు, ఇతర వైద్యులు పరీక్షిస్తుంటారు.
కాల్‌సెంటర్ నుంచి వైద్యులు ఫోన్ చేసి కొవిడ్ కిట్ ఇచ్చారా.. లేదా? అందులో ఉన్న మందులను వైద్యుల సూచన మేరకు వాడుతున్నారా లేదా? ఆని ఆరా తీస్తారు. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సూచనలు చేస్తుంటారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్‌కు 45 వేల కాల్స్ వచ్చినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్, కొవిడ్ కంట్రోల్ రూమ్ ఇంఛార్జి డాక్టర్ తిరుమల రావు తెలిపారు.
ఇదీ చదవండి: