కరోనాతో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన కంచిభొట్ల బ్రహ్మానందం(63) అమెరికాలో మృతి చెందారు. ఆయన ప్రముఖ పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు. తర్వాత అమెరికా వెళ్లారు. కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఓ ప్రముఖ పత్రికలో పని చేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన.. సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఏదుబాడులోని బంధువులకు సమాచారం అందింది.
అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి - prakasa dst person was died due to corona virus in america
కరోనా కారణంగా అమెరికాలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు.
![అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి అమెరికాలో ప్రకాశం జిల్లా వాసి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6704830-101-6704830-1586310781083.jpg?imwidth=3840)