Farmers Problems: అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, సంతమాగులూరు, జె.పంగులూరు, బల్లికురవ తదితర మండలాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, పసుపు, కరివేపాకు, శెనగ, కూరగాయల పంటలకు నీరందించలేక రైతులు సతమతమవుతున్నారు. ఏపుగా పెరిగిన పంటలకు.. సమయానికి నీరు అందించలేని పరిస్థితి ఉంది.
పంటకు సరిపడా నీరు ఇవ్వలేకపోతున్నాం..
ఇదివరకు సాగుకు 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని రైతులు చెబుతున్నారు. వారం రోజులుగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని.. దీని వల్ల పంటకు సరిపడా నీరు ఇవ్వలేకపోతున్నామని వాపోయారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. రెండు, మూడు ఎకరాలకు నీరందించేందుకు కూడా ఐదారు రోజుల సమయం పడుతుందన్నారు. విద్యుత్ కోతలపై అధికారులను అడిగినా సరైన సమాధానం లేదని రైతులు చెబుతున్నారు. సాగుకు 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Gold Seized at Shamshabad: బంగారం తరలిస్తున్న సౌదీ ప్రయాణికుడు.. శంషాబాద్ విమానాశ్రయంలో పట్టివేత