Narsayapalem fake notes Incident update: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెంలో ఆదివారం నాడు వాలంటీర్లు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు వచ్చిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు రావడంపై లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై షెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన వాలంటీర్ ఆమోస్‌ను ప్రశ్నంచగా అతడు బుకాయించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు..వాలంటీర్ ఆమోస్‌ను గట్టిగా అడగ్గా అసలు విషయం బయటపడింది. తానే ఆ దొంగ నోట్లను మార్చినట్లు ఒప్పుకున్నాడని ఎంపీడీఓ సుబ్బారాయుడు తెలిపారు. అతడిని విధుల నుంచి తొలిగించి, పోలీసులకు అప్పజెప్పమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాలంటీర్ ఆమోస్‌కి దొంగ నోట్లు ఎలా వచ్చాయి?, ఎక్కడ నుంచి వచ్చాయి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..: యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రోజు వాలంటీర్ ఆమోస్ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఓ లబ్ధిదారుడు పింఛను నగదుతో ఓ దుకాణానికి వెళ్లగా.. అందులో నకిలీ నోట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకెళ్లగా. పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి. దీంతో గ్రామంలో రూ.19వేల విలువైన రూ.500 నకిలీ నోట్లను లబ్ధిదారుల నుంచి వాలంటీరు తీసుకొని అధికారులకు అప్పగించారు.
"నేను తెల్లవారే సరికి పింఛన్లు ఇచ్చేశాను. తెల్లవారిన తరువాత ఇవి దొంగనోట్లు అని పింఛను తీసుకున్నవారు చెప్పారు. నేను వాటిని పరిశీలించి, అధికారులకు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చి వాటిని తీసుకువెళ్లారు" అని వాలంటీర్ ఆమోస్ తెలిపారు.
ఇవీ చదవండి