ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పునరావతం కాకుండా ఉండాలని ఉద్దేశంతో అద్దంకి పట్టణంలోని మెడికల్ షాప్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. షాపులలో అమ్ముతున్న వివిధ రకాల బ్రాండ్లను గుర్తించారు. మెడికల్ షాప్ యజమానులకు సూచనలు చేశారు. శానిటైజర్లను తాగేందుకు కొంతమంది వినియోగిస్తున్నారని వారికి అమ్మకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: సీఎం మాట తప్పి మడమ తిప్పారు.. రాజీనామా చేస్తారా..?: చంద్రబాబు