ETV Bharat / state

చోరీ జరిగిన అరగంటలోనే దొంగను పట్టుకున్న పోలీసులు - theft at kanigiri news

ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ గుడి ప్రాంగణంలో చోరీ జరిగింది. చోరీ చేసిన దొంగను అరగంటలోనే పోలీసులు పట్టుకున్నారు.

kanigiri
చోరీ చేసిన గంటలోనే దొంగను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : May 27, 2021, 10:38 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో హనుమంతునిపాడు మండలం దాసర్లపల్లి గ్రామ సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్న వెంకటనారాయణ మరో వ్యక్తితో కలిసి స్థానిక సాయిబాబా గుడికి వచ్చాడు. గుడిలోకి వెళ్తూ అంతకుముందు తన బైక్ ట్యాంక్ కవర్లో ఉంచి సెల్​ఫోన్​ని మర్చిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు దొంగలు బైక్​లోని సెల్​ఫోన్ దొంగలించి తమ బైకుపై పరారయ్యారు. దేవస్థాన కమిటీ ఛైర్మన్ దేవకీ సుబ్రహ్మణ్యం వెంటనే ఈ విషయాన్ని కనిగిరి ఎస్ఐ రామిరెడ్డికి తెలిపారు. వెంటనే స్పందించిన ఎస్ఐ సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సీసీ కెమెరా వీడియోని పరిశీలించారు. దొంగలు గార్లపెట రోడ్ వైపు వెళ్లడంతో తన సిబ్బందితో వెళ్లి వృద్దుల ఆశ్రమం సమీపంలో దొంగల్ని పట్టుకున్నారు. అనంతరం సెల్​ఫోన్​ను ఆలయ కమిటీ సమక్షంలో వెంకట నారాయణకు అందజేశారు. దొంగతనం జరిగిన వెంటనే స్పందిచడంతో పాటు అరగంటలోనే దొంగలను పట్టుకున్న ఎస్ఐ రామిరెడ్డిని పలువురు అభినందించారు.

ఇదీ చూడండి.

Lock Down: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా.. అయితే ఈ పని చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.