Pigeons Left in air : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి సమీపంలో.. మరోసారి పెద్ద సంఖ్యలో పావురాలను గాలిలోకి ఎగరేశారు. చెన్నై పరిసర ప్రాంతాల నుంచి 4 లారీల్లో సుమారు 3 వేల పావురాలను చిన్నచిన్న పెట్టెల్లో తీసుకొచ్చి వదలడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు 4 లారీలను, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, సహాయకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివిధ సంస్థలకు చెందిన పావురాలను పందెం కోసం తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం పావురాలను ఎగర వేసేందుకు అనుమతి ఉందని చెబుతున్నారు.
సాధారణంగా పావురాలు బెట్టింగ్ నిర్వహించేవారు అనుకున్న ప్రాంతం నుంచి పావురాలను దూరంగా తీసుకు వచ్చి గాల్లోకి వదులుతారు. ముందుగా ఏ పావురం అయితే.. వారు అనుకున్న ప్రాంతానికి చేరుతుందో దానికి సంబంధించిన యజమానిని విజేతగా ప్రకటిస్తారు. అయితే.. ఇది బెట్టింగా? శిక్షణా? అనే విషయం తెలియాల్సి ఉంది. అద్దంకి పరిసర ప్రాంతాల్లో పావురాలను ఎగర వేసేందుకు నిర్వాహకులు రావడం గడిచిన పది రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. దీంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి : Pigeons Betting: పావురాలను తీసుకొచ్చారు.. గాల్లో ఎగురవేశారు.. ఎందుకు ?