ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మద్దెల వెంకట నారాయణ అనే వ్యక్తి కొంతకాలంగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యురాలు హైమావతి రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు.
తమను మానసికంగా వేధిస్తోందని అంటూ.. పెట్రోలు పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అయితే స్థానికులు కూడా ఆమెపై అదే ఆరోపణ చేశారు. మొదటినుంచీ ఆమె అలానే ప్రవర్తిస్తోందని, ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: