ETV Bharat / state

ఆన్​లైన్ మోసానికి కాదేదీ అతీతం - ఆన్​లైన్ ఫ్రాడ్ న్యూస్

ఆన్​లైన్ మోసాలు చేయడానికి.. ఏదైతేనేం.. బుట్టలో పడే వాళ్లుంటే చాలు. సేవా కార్యక్రమాలు చేస్తాం.. ఆసుపత్రులు నిర్మిస్తామంటూ.. నమ్మబలికి డబ్బులు దోచుకునే దందా చేస్తారు. అలాంటి నైజీరియా ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఆన్​లైన్ మోసానికి కాదేదీ అతీతం
ఆన్​లైన్ మోసానికి కాదేదీ అతీతం
author img

By

Published : Feb 25, 2020, 11:15 PM IST

ఆన్​లైన్ మోసానికి కాదేదీ అతీతం

సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆసుపత్రులు, చర్చిలు నిర్మిస్తామంటూ, పలువురిని మోసం చేస్తూ ఆన్​లైన్‌ ద్వారా డబ్బులు కాజేసే నైజీరియా ముఠా సభ్యులను ప్రకాశం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఇలాంటి మోసాలకు పాల్పడి, తిహార్‌ జైల్‌లో ఉండి విడుదలైనా ఒయంకో హైజినస్‌ అలియాస్‌ పీటర్‌ డానియల్‌ అనే నైజీరియన్​ మళ్లీ అదే బాట పట్టాడు.

పీటర్‌ డానియల్‌ ఫుట్​బాల్‌ కోచ్‌గా భారతదేశానికి వచ్చానని చెప్పుకున్నాడు. దేశంలో చర్చిలు, ఆసుపత్రులను నిర్మిస్తూ సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నామని, అందులో భాగస్వామ్యం అయ్యేవారు తమను సంప్రదించవచ్చునంటూ ఫేస్‌బుక్​ ద్వారా ప్రచారం చేశాడు. టిబి జాషువా మినిస్ట్రీస్‌ పేరుతో నకిలీ అకౌంట్‌ ఏర్పాటు చేసుకొని పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలి బాపిస్టు కాలనీకి చెందిన వేల్పుల అచ్చయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2.4 మిలియన్ల డాలర్ల డబ్బుతో బయలుదేరి భారత దేశానికి వస్తున్నామని, ఇందులో భాగస్వామ్యం అయితే 20శాతం కమీషన్‌ ఇస్తామని వాట్సాప్‌ సందేశాన్ని పంపిచాడు.

డానియల్​ను నమ్మిన అచ్చయ్య కొంత డబ్బు పంపించాడు. తరువాత ఎయిర్‌ పోర్టులో ఉన్నాను... కస్టమ్స్‌ అధికారులు సోదాలు చేశారని, మరికొంత డబ్బు పంపిస్తే ఈ డబ్బును విడుదల చేస్తారని తెలిపాడు. ఆ తరువాత ఆదాయపు పన్నుల శాఖకు చొంత చెల్లించాలని, రిజర్వు బ్యాంకులో సమస్య తలెత్తిందని ఇలా.. పలుమార్లు అచ్చయ్యకు ఫోన్‌ చేసి మొత్తం మీద 14.67 లక్షలు రూపాయలు ఖాతాలో వేయించుకున్నాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా పొదిలి పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. నైజీరియా వ్యక్తి చేసిన మోసం గుర్తించి, అతడికి సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 మొబైల్స్, 9 ఎటీఎమ్ కార్డులు, 22 చెక్‌పుస్తకాలు, నైజీరియా పౌరసత్వపు కార్డు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: సైబర్ నేరాల్లో చదువుకున్నవారే మోసపోతున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.