ONLINE CHEATING IN KANIGIRI: వైసీపీ అండదండలతో ఆన్లైన్ యాప్‌లో పలువురు వృద్ధులను సైతం సభ్యులుగా చేరుస్తూ వారికి వచ్చే పింఛన్ను నొక్కేస్తూ.. వాలంటీర్లు వారిని మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ మితిమీరిపోతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలను చింద్రం చేస్తున్న ఘటలు జరుగున్నాయి. అయినప్పటికీ ప్రజలు అత్యాశకు పోయి ఉన్న సొమ్మును కాస్త ఆన్లైన్ యాప్‌లలో పెట్టుబడిగా పెట్టి నష్టపోతున్నారు. ఇలాంటి మోసమే ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.
నమ్మించి నట్టేట ముంచడం అంటే ఇదేనేమో!.. 10కోట్లు విలువ చేసే భూమిని కొట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే
EWT APP THRUOGH CHEATING : కనిగిరి పట్టణానికి చెందిన షేక్ సుల్తాన్ అనే వార్డ్ వాలంటీర్‌కు టెలిగ్రామ్‌లో వచ్చిన మెసెజ్ ఆధారంగా ఈడబ్లూటీ యాప్‌లో వెయ్యి రూపాయలు చెల్లించి సభ్యత్వ పొందాడు. మొదట్లో ఈ యాప్ ద్వారా మంచి ఆదాయం వస్తుండడం వల్ల స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే నలుగురు వ్యక్తులను కూడా ఈ యాప్‌లో ప్రధాన పాత్ర పోషించే విధంగా వార్డు వాలంటీర్ సుల్తాన్ ఆశ కల్పించి సభ్యులుగా చేర్చాడు. ఇదే అదునుగా భావించిన స్థానిక ఎమ్మెల్యే కార్యాలయలోని కంప్యూటర్ ఆపరేటర్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులు వైసీపీ అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని సుమారు 150 మంది వరకు కనిగిరి ప్రాంత వాలంటీర్లను ఈడబ్లూటీ యాప్‌లో సభ్యులుగా చేర్చారు. అత్యుత్సాహం ప్రదర్శించిన వాలంటీర్లు కమీషన్లకు ఆశపడి పింఛన్ పొందే లబ్ధిదారులను అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టించి ఆన్లైన్ యాప్‌లో భాగస్వామ్యం చేశారు.
భూసేకరణకు హామీలిచ్చారు.. ఇప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు: నిర్వాసితులు ఆక్రోశం
స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ప్రధాన వైద్యులు, వైద్యశాల సిబ్బంది ఈ యాప్‌లో సభ్యులుగా చేరడం గమనార్హం. 1000 రూపాయలు చెల్లించి ఈడబ్ల్యూటీ యాప్‌లో సభ్యులుగా చేరిన నాటి నుంచి రోజుకు 30 రూపాయల చొప్పున 150 రోజులపాటు 5400 ల నగదు వస్తుందని ఆశ చూపారు వాలంటర్లు.
'అత్యాశకు పోయిన ఈ యాప్‌లో చేరాము. నెల రోజుల పాటు సజావుగా రోజుకు 30 రూపాయలు చొప్పున నగదు వచ్చింది. కానీ గత రెండు రోజులుగా యాప్‌ను నిలిచిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. నేను ఈ యాప్‌లో నేను చేరాను, నాకు డబ్బులు రావడంతో నాతోపాటు చాలా మంది ఇందులో చేరి చివరకు మోసపోయారు.' సుల్తాన్(వార్డ్ వాలంటీర్, కనిగిరి)
YCP ONLINE CHEATING IN PRAKASAM DISTRICT : ఈ తరహా ఆన్లైన్ మోసంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎంతో ఆర్భాటంగా వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా వృద్ధుల పింఛన్ను ఈ విధంగా వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నా ఎస్సీ.. నా ఎస్టీలు.. అంటూనే కత్తరేశారు! సూక్ష్మసేద్యంపై విమర్శలతో దిగొచ్చిన జగన్ సర్కార్!
వాలంటీర్లుగా చేరిన కొందరు అమాయకులు కుట్ర గురించి మాకు తెలియదు. మేము కూడాా నష్టపోయాము. ఆశపడి ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టాము . ఇదే అదనుగా తీసుకొని స్థానిక వైసీపీ నేతలు చేసిన నిర్వాకానికి మేము డబ్బు కోల్పోయాము. పోలీసు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.