ETV Bharat / state

ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు

Ongole Damage Main Roads In Auto Nagar: ఒంగోలు ఆటోనగర్‌ రోడ్డు ఏవిధంగా ఉందో చూశారుగా. రహదారా! అదెక్కడ ఉంది అనుకుంటున్నారా? వర్షపు నీటితో నిండిపోయిన ఆ పెద్ద గుంతల మధ్యలోనే ఉంది. ఈ ఆటోనగర్‌ను త్రోవగుంట వద్ద 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి సమస్యలు ఇక్కడ తిష్ట వేశాయి.

Damage Main Roads In Ongole Auto Nagar
Damage Main Roads In Ongole Auto Nagar
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 12:16 PM IST

ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు

Damage Main Roads In Ongole Auto Nagar: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆటోనగర్‌లో చిన్నచినుకు పడితే చాలు ఆ ప్రాంతమంతా అధ్వానంగా మారిపోతోంది. రోడ్లు చెరువుగా తలపిస్తున్నాయి. ప్రధాన రహదారి కావటంతో అక్కడ నివాసం ఉంటున్న కార్మికులు, యజమానులు కనీస వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఒంగోలు ఆటోనగర్‌లో ఫ్లాట్లు అయితే కేటాయించారు తప్ప వారు పడుతున్న ఇబ్బందులను మాత్రం ఎవరు పట్టంచుకోవడంలేదు.

చూశారుగా ఒంగోలు ఆటోనగర్‌ రోడ్డు ఏవిధంగా ఉందో! రహదారా అదెక్కడ ఉంది అనుకుంటున్నారా? వర్షపు నీటితో నిండిపోయిన ఆ పెద్ద గుంతల మధ్యలోనే ఉంది. ఈ ఆటోనగర్‌ను త్రోవగుంట వద్ద 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఒంగోలుకు సంబంధించిన భారీ వాహనాల మరమ్మతులు, స్పేర్‌ పార్టుల తయారీ వంటివి ఇక్కడే చేస్తారు. దాదాపు 350 ప్లాట్లలో 5 వేల మంది యజమానులు, కార్మికులకు ఇదే ఉపాధి కేంద్రంగా నిలుస్తోంది. అయితే ఏళ్ల తరబడి సమస్యలు ఇక్కడ తిష్ట వేశాయి. మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యాలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక నరకం చూస్తున్నామని కార్మికులు వాపోతున్నారు.

జగనన్న మీద నమ్మకంతో గుంతలో లారీలు దింపారు - అంతే గంటల తరబడి అవస్థలు!

Drainage Water Comes In Main Roads: ఏపీఐఐసీ(Andhra Pradesh Industrial Infrastructure corporation Limited) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటోనగర్‌.. జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఇక్కడకు ఇతర రాష్ట్రాలకు రాకపోకలు చేసే వాహనాలు కూడా మరమ్మతులకు వస్తాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాదారుల సిబ్బంది బస చేయడానికి కూడా సరైన వసతులు లేవు. వర్షం వచ్చిందంటే చాలు రోడ్లు చెరువును తలపిస్తోంది. ఈ నీరు బయటకు వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల దుకాణాలు, మెకానిక్‌ షెడ్లు నీట మునిగి పనులు చేసుకోడానికి ఏ మాత్రం వీలు పడటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల మీడియం అండ్‌ స్మాల్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (Medium And Small Cluster Development Programme) కింద 11కోట్ల రూపాయలతో ఆటోనగర్‌లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర నుంచి 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40శాతం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. మరి ఎప్పుడు నిధులు మంజూరు అవుతాయో ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఆటోనగర్​లోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, అభివృద్ధికి కృషిచేయాలని కార్మికులు కోరుతున్నారు.

Road Washed Out in Alluri District: కొట్టుకుపోయిన రోడ్డు.. స్తంభించిన జన జీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.