అలీవ్ రిడ్లీ తాబేళ్ల సంతతి అంతరించిపోకుండా అందరూ కాపాడాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు డీఎఫ్ఓ సతీష్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి సముద్ర తీరం వద్ద 67 అలీవ్ రిడ్లీ తాబేళ్లు పిల్లలను సముద్రంలోకి వదిలారు. చెన్నై ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీశాఖ ఒంగోలు రేంజ్, గిద్దలూరు డివిజన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సముద్ర తాబేళ్ల సంరక్షణా కేంద్రంలోని తాబేళ్ల నుంచి సేకరించిన పిల్లలను సముద్రంలోకి వదిలారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి పి.శ్రీకాంత్ రెడ్డి, తాబేళ్ల సంరక్షకులు ఎస్. సుబ్బారావు, మోటుపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అదానీ ఆదీనంలోకి గంగవరం పోర్టు..డీవీఎస్ రాజు వాటా కోనుగోలు