నివర్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దర్శి నుంచి అద్దంకి వెళ్లే మార్గంలో చిలకలేరు వాగు పొంగిన కారణంగా.. రాకపోకలు స్తంభించాయి.
దర్శి నుంచి తూర్పు గంగవరం, దర్శి నుంచి ఒంగోలు వెళ్లే మార్గాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.. ఆ ప్రాంతాల్లోనూ రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రాత్రింబవళ్లు అక్కడే పహారా కాస్తున్నారు.
ఇదీ చదవండి: