ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల గ్రామంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయల పంటలకు పెట్టిందిపేరు. అందులో భాగంగా ఇక్కడి రైతులు నిత్యం కొత్తిమీర, పాలకూర, తోటకూర, కరివేపాకు పంటలు పండిస్తుంటారు. ఈ రకం పంటలు లాభసాటిగా ఉండటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తక్కువ పెట్టుబడులతో ఆశించిన రాబడి వస్తుండడం వల్ల ఇక్కడి రైతులు ఇటువంటి పంటలపై మక్కువ చూపుతున్నారు. అందులో భాగంగా అధిక ఉష్ణోగ్రతలు, చీడపీడల నివారణకు షెడ్ నెట్లను నిర్మించి అందులో డ్రిప్‌ను ఉపయోగించి కొత్తిమీర, పాలకూర, తోటకూర, వెలుపల కరివేపాకు పంటలను పండిస్తున్నారు.
గతంలో ఇలాంటి పంటలు పండించాలంటే అధిక పెట్టుబడులతో పాటు ఉష్ణోగ్రతలు అనుకూలించక పోవడం వల్ల నాణ్యత తగ్గిపోవడంతో రసాయనిక ఎరువులు వాడవలసి వచ్చేదని... దీనిని అధిగమించేందుకు ఎకరానికి ఒక లక్ష రూపాయల చొప్పున నాలుగు ఎకరాలకు నాలుగు లక్షల వ్యయంతో షెడ్ నెట్లను నిర్మించి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఏడాది పొడవునా ఇలాంటి తక్కువ పెట్టుబడి పంటలను పండించుకొంటూ.. మంచి ఆరోగ్యంతో పాటు మంచి దిగుబడిని పొందుతున్నామని రైతులు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఆరుతడి పంటలకు సాగర్ నీరు.. విడుదలకు సన్నాహాలు'