ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. 'రైతు కోసం' కార్యక్రమం రెండో రోజు పర్యటనలో భాగంగా మేడపిలో తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆయా రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: వెలగపూడిలో ఘర్షణపై ఎఫ్ఐఆర్.. ఎంపీ పేరును చేర్చని పోలీసులు!