ప్రకాశం జిల్లా మార్కాపురంలో పురపాలక పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు విధులు బహిష్కరించారు. 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించలేదని వారు ఆందోళన చేపట్టారు. జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి అంటూ వాపోయారు. విధులు బహిష్కరించడంతో మార్కాపురం పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయింది. వేతనాలపై మున్సిపల్ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము విధుల్లో చేరేది లేదని స్పష్టం చేశారు.
ఇదీచూడండి.మార్కాపురంలో వైభవంగా జ్వాలా తోరణం