ETV Bharat / state

పట్టణాలు, నగరాల్లో ఎన్నికల ప్రచార హోరు - Municipal elections campaigns

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఆభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హామీలు గుప్పిస్తూ... పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు.

పట్టణాలు, నగరాల్లో ఎన్నికల ప్రచార హోరు
పట్టణాలు, నగరాల్లో ఎన్నికల ప్రచార హోరు
author img

By

Published : Mar 4, 2021, 9:55 PM IST

Updated : Mar 4, 2021, 11:00 PM IST

మండుటెండలను సైతం లెక్కచేయకుండా....ఓటర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా....పురపోరు ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్పష్టత రావటంతో....రాజకీయపార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. విజయవాడలో 15వ డివిజన్ అభ్యర్థి తరపున ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, వైకాపా నేత దేవినేని అవినాష్ ప్రచారంలో పాల్గొన్నారు. 42వ డివిజన్ అభ్యర్థి తరపున వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్యే జోరి రమేశ్ ప్రచారం నిర్వహించారు. 47వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థితో కలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50 డివిజన్‌లో మాజీ మంత్రి దేవినేనిఉమామహేశ్వరరావు. ... ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా ప్రచారం చేపట్టారు. 16వ డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్... 23వ డివిజన్ లో ఎంపీ కేశినేని ఓట్లు అభ్యర్థించారు. 16వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. మరోవైపు వైకాపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ... వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

గుంటూరు జిల్లా రేపల్లెలో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. 9,10,11 వార్డుల్లో తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. సైకిల్ గుర్తును సైగలతో చూపుతూ...పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.16,17,18,19 వార్డుల్లో వైకాపా అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రచారం చేశారు. గుంటూరులో సీపీఐ అభ్యర్థి జంగాల రమాదేవికి తరపున....సీపీఐ జాతీయ కార్యదర్శి ప్రచారం చేపట్టారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న వైకాపాకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

పట్టణాలు, నగరాల్లో ఎన్నికల ప్రచార హోరు

విశాఖ మహానగరపాలక సంస్ధలో 21వ వార్డులో వైకాపా అభ్యర్ధి వంశీ కృష్ణ యాదవ్ మద్దతుగా మంత్రి కె. కన్నబాబు, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రచారం నిర్వహించారు. వైకాపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర పాలక ఎన్నికలలో తాము ఘన విజయం సాధించబోతున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి కార్యకర్తలకు వివరించారు.

రాయలసీమలో పురపోరు ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో భాజపా అభ్యర్థి తరపున ఆ పార్టీ నేత ఆదినారాయణరెడ్డి ప్రచారం నిర్వహించారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థుల తరపున సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వైకాపా, తెదేపా అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. అనంతపురంలో వైకాపా ఎమ్మెల్యే అనంత వెంట్రామిరెడ్డి అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. హిందూపురంలో తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ....విస్తృతంగా ప్రచారం చేసి పార్టీశ్రేణుల్లో జోష్ పెంచారు. తనదైన శైలిలో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ రెండేళ్లుగా చేస్తున్న అభివృద్ధిని చూసి వైకాపాకు ఓటు వేయాలని అనంతపురంలో 25వ డివిజన్ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరు వైకాపా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మడకశిర నగర పంచాయతీ పరిధిలో వార్డ్ కౌన్సిలర్ల గెలుపు కోసం మొదటి రోజు ఎమ్మెల్యే ఏం.తిప్పేస్వామి ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాలలో వైకాపా, తెదేపా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. చీరాలలో అభ్యర్థులు ఇంటింట ప్రచారాలు ప్రారంభించారు....పట్టణంలోని 19 వ వార్దు వైకాపా అభ్యర్థి మించాల సాంబశివరావు గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు..... తనను గెలిపిస్తే వార్దును అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వైకాపా అభ్యర్థులు...ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తునిలో... 15 వార్డులు ఏకగ్రీవం కావటంతో.. మిగిలిన 15 వార్డుల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరటం ఖాయమని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేశారు. చీరాల మూడో వార్డులో వైకాపా అభ్యర్థి బత్తుల రోసా లత ప్రచారం చేస్తుండగా...11,13,20 వార్థుల్లో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు వైకాపా యువనాయకుడు కరణం వెంకటేష్ ప్రచారాలు చేస్తున్నారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైకాపా, తెదేపా, భాజపా, జనసేన పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం అభ్యర్థుల తరపున ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు. సాలూరులో వైకాపా అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే రాజన్నదొర ప్రచారం నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని సాలూరులో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం చేసి ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తెదేపా ఎమ్మెల్యే అశోక్‌బాబు ప్రచారంలో పాల్గొని... కరపత్రాలు అందజేశారు. పాలకొండలో వైకాపా ఎమ్మెల్యే కళావతి ప్రచారంలో పాల్గొన్నారు. పలాస-కాశీబుగ్గ పుర ఎన్నికలు రసవత్తరంగా మారటంతో....ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రచారంలో పాల్గొని....తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. ప్రచారంలో తప్పెట గుళ్లు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పన్నుల భారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న వైకాపాకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి

పాఠశాలలో ఆర్​వో ప్లాంట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Last Updated : Mar 4, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.