రాష్ట్రం మొత్తం మీద నడిపిస్తున్న 58 సంజీవిని మొబైల్ ల్యాబ్ బస్సుల్లో ఒకటి మన దర్శి నియోజకవర్గానికి కేటాయించడం చాలా సంతోషంగా ఉందని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. సంజీవిని మొబైల్ బస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంజీవిని బస్సులో సేకరించిన నమూనాలను దర్శిలోనే పరీక్షలు నిర్వహించే విధంగా ల్యాబ్‌ను కూడా ప్రారంభించటం జరిగిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎక్కడ భౌతిక దూరం పాటించకపోవడం పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాగానే అభిమానులు, చోట నాయకులు గుంపులు గుంపులుగా చేరడం పోలీసులు సైతం చేసేదేమీ లేక మిన్నకుండి పోయారు. అయితే పోలీసులు ప్రజలకు అన్ని నియమాలు చెబుతారు.. రాజకీయ నాయకులకు చెప్పరా..? వారికి కరోనా రాదా అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు.
ఇవీ చూడండి...