ఇవీ చదవండి:
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు: ఎమ్మెల్యే బలరాం - వేసవిలో తాగునీటి ఎద్దడికి ప్రణాళిక
రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సాగునీటి, పారిశుద్ధ్యం అవసరాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. వేసవి సమీపిస్తోండటంతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కరణం బలరాం సమీక్షా సమావేశం
ఇవీ చదవండి: