ETV Bharat / state

పనిగట్టుకొని ప్రచారం.. పవన్‌ పార్టీ మారతారా? - బాలినేని - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

తాను జనసేనలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్​కు స్పందించానని చెప్పారు.

MLA Balineni
బాలినేని శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Aug 10, 2022, 12:28 PM IST

తాను జనసేన పార్టీలోకి వెళుతున్నట్టు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. వైఎస్​ఆర్‌ కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే.. పార్టీ కేడర్‌ మధ్య కొంత సమన్వయ లోపం ఉందని.. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకే సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి

దీన్ని వక్రీకరించి.. తాను జనసేనలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. చేనేత వస్త్రాల విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​ విసిరిన చాలెంజ్ ను స్వీకరించి.. చేనేత వస్త్రాలు ధరించానన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలోగానీ.. ఇప్పుడు జగన్​ రెడ్డి హయంలోగానీ.. చేనేతకు తాము ఎంతో చేశామని, అందుకే పవన్‌ ట్వీట్​కు సమాధానం ఇచ్చానని చెప్పారు. దీనికి తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్​ను పవన్‌ స్వీకరించారని.. అంతమాత్రాన పవన్‌ పార్టీ మారతారని అనుకోవాలా? అని బాలినేని ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖరరెడ్డి అని.. తాను ఎప్పుడూ వైఎస్‌ఆర్ పార్టీలోనే ఉంటానని.. జగన్​ వెంట నడుస్తానని తేల్పిచెప్పారు. తాను ఊసరవెల్లి రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.