MLA Anna Rambabu Latest Decision: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు సంచలన ప్రకటన చేశారు. జిల్లాలో తమ పార్టీకే చెందిన ఓ ముఖ్య సామాజిక వర్గం తనను లక్ష్యంగా చేసుకుందంటూ కీలక ప్రకటన చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తాననే టార్గెట్ చేసి ఓ సామాజికవర్గం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన వాపోయారు. కొందరి నాయకులను జిల్లా ప్రజలు ఆదరించవద్దని, వారి ఓటమి కోసం పర్యటనలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నన్నట్లు చేసిన ప్రకటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయలకు తన ఆరోగ్యం సహకరించడం లేదని, అనారోగ్య కారణాలు కూడా తాను రాజకీయల నుంచి తప్పుకోడానికి మరో కారణమని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు
ఎస్సార్సీపీకి చెందిన అన్నా రాంబాబు సొంత పార్టీలోని ఓ సామాజిక వర్గంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో ఆ సామాజిక వర్గం ముఖ్యపాత్ర పోషిస్తోందని, ఆ వర్గం తననే లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తానను లక్ష్యంగా చేసుకుని చాలా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.
ప్రకాశం జిల్లాకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేసిందేంటని ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రశ్నించారు. 34సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని అన్నారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతా పర్యటిస్తానని ప్రకటించారు.
"నా ఆరోగ్య కారణాల రీత్యా, నాయకుడు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను న్యాయం చేయలేమోననే భావనతో నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఈ రోజు వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. అది ఎందుకోసమో నాకు తెలియదు." - అన్నా రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే
ఎవరి టికెట్ చిరుగుతుందో! - జగన్ క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల నిరీక్షణ