నివర్ తుఫాన్ ప్రభావం నుంచి బయటపడని రైతు.. తాజాగా కురుస్తున్న అకాల వర్షాలకు విలవిల్లాడుతున్నాడు. మిర్చి, కంది పంటలు మళ్లీ దెబ్బతిన్న కారణంగా.. మరింత నష్టాలు తప్పవని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సుమారు గంటన్నర పాటు భారీగా కురిసిన వర్షం.. పొలాలను నీట ముంచింది.
ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్న తరుణంలో.. ఈ రోజు కురిసిన వర్షానికి ఉన్న మిరపకాయలు సైతం తాలుకాయలుగా మారుతాయని.. వాటిని అలాగే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకుని దారి చూపించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: