ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. స్థానిక బంగ్లా రోడ్డు నుంచి భవాని సెంటర్ కూడలి వరకు ప్రచారం నిర్వహించారు. అన్ని వార్డుల్లో గెలిచి ముఖ్యమంత్రికి నగర పంచాయతీని కానుకగా ఇవ్వాలన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద విద్యార్థికి విద్యను అందించాలని దృఢ సంకల్పంతో అమ్మఒడి పథకం చేపట్టామన్నారు. అద్దంకి వైకాపా ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెదేపా ఎమ్మెల్యే రవికుమార్ ప్రచారం..
అద్దంకి పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పట్టణంలోని 14,15,17 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. అద్దంకి మునిసిపాలిటీ అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపిచాలన్నారు.
ఇదీ చదవండి: జోరుగా సాగుతున్న పుర ఎన్నికల ప్రచారం