ETV Bharat / state

లోకేశ్ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి బాలినేని - నారా లోకేశ్​పై బాలినేని శ్రీనివాస్ ఫైర్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​పై.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని బాలినేని సవాల్ విసిరారు.

minister balineni srinivas reddy
లోకేశ్ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి బాలినేని
author img

By

Published : Mar 7, 2021, 6:26 PM IST

Updated : Mar 7, 2021, 8:13 PM IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించారు. లోకేశ్​కు మతి భ్రమించిందని విమర్శించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తనను హవాలా మంత్రి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. చెన్నై బంగారు వర్తకుడి వద్ద దొరికిన డబ్బుకు తనకు సంబంధం లేదనే విషయాన్ని ఆరోజే స్పష్టం చేసినట్లు తెలిపారు.

'నేను పేకాడతాను.. అది నా వ్యక్తిగతం. గత 20 ఏళ్ల నుంచి నా మీదున్న ఏకైక విమర్శ అది. మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పెద్ద చిట్టానే ఉంది. కానీ నాకు సంస్కారం ఉంది. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ చాలా మంది దగ్గర అప్పులు తీసుకొని తిప్పిస్తున్నారు. అతని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే నేను చాలా మాట్లాడగలను'- బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి

లోకేశ్ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి బాలినేని

స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు.. వాస్తవాలు తెలుసుకోని లోకేశ్ మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. ప్రచారానికి వచ్చిన వారు ప్రచారం చేసుకొని వెళితే బాగుంటుందన్న ఆయన.. వ్యక్తిగత ఆరోపణలు చేయటం కుట్ర రాజకీయాలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. లోకేశ్ కనీసం నగర కార్పొరేటర్​గా కూడా గెలవలేరని ధ్వజమెత్తారు.

ప్రకాశం జిల్లాలోని పాల డెయిరీని నిర్వీర్యం చేసింది తెదేపా ప్రభుత్వం కాదా అని బాలినేని ప్రశ్నించారు. వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాము అని చెప్పుకునే దామచర్ల.. 25 వేల ఓట్లతో ఎందుకు ఓడిపోయారో సమీక్షించుకోవాలని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

స్టీల్ ప్లాంట్ కోసం వైకాపా నిరసనలు.. ఎన్నికల స్టంట్​: పవన్

Last Updated : Mar 7, 2021, 8:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.