తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిలు రాసిన లేఖకు మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తీర్చేందుకు చెరువులను సాగర్ నీటితో నింపాలని, వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ లేఖ రాశారు. దీనిపై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదివరకే ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, పరిశీలనలో ఉందని తెలిపారు. కలెక్టర్‌తో మాట్లాడి సమగ్ర సమాచారాన్ని పరిగణలొకి తీసుకుంటామని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చెప్పారు.
ఇవీ చూడండి..