ETV Bharat / state

'నియోజకవర్గంలోని సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులివ్వండి' - cc roads funds release

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని తన నియోజకవర్గంలో సీసీ రోడ్లకు నిధులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై మంత్రితో ఆయన చర్చించారు.

cc roads funds release
నియోజకవర్గంలో సీసీ రోడ్లకు నిధులు ఇవ్వండి
author img

By

Published : Jul 13, 2021, 10:19 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో సీసీ రోడ్లకు నిధులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించారు.

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు లేవని ముఖ్యంగా చెంచు గిరిజన కాలనీల్లో రోడ్ల నిర్మాణాలకు దాదాపు రూ.10 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోరారు. ఇంకా గతంలో చేసిన పనులకు కూడా నిధులు మంజూరు కాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని పరిశీలించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సురేశ్ అభ్యర్ధనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి యర్రగొండపాలెం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.

ఇదీ చదవండి:

CM Jagan: 'పల్లెలు శుభ్రంగా ఉంటేనే..ప్రజలకు ఆరోగ్యం'

Minister Buggana: 'రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి.. అర్థరహిత విమర్శలొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.