ETV Bharat / state

ఊరెళ్లిపోతామంటూ వలస కార్మికుల ఆందోళన - చీమకుర్తిలో వలస కార్మికుల ఆందోళన

రాష్ట్రంలో వలస కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొవ్వూరు, గాజువాక ఘటనలు మరువకముందే ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనూ వలస జీవులు ఆందోళన చేపట్టారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వీరంతా తమను స్వస్థలాలకు పంపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

protest
protest
author img

By

Published : May 6, 2020, 2:40 PM IST

కార్మికుల ఆందోళన

ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమను సొంత గ్రామాలకు పంపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు.

లాక్​డౌన్‌ కారణంగా క్వారీలు, పరిశ్రమలు మూతపడిన కారణంగా.. వీరంతా 40 రోజులుగా పనుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల పరిశ్రమల నిర్వహణకు కొంత వెసులు బాటు ఇవ్వటంతో వీరందరినీ మళ్లీ పనుల్లోకి తీసుకునేందుకు క్వారీ, పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నారు.

అయినా కూడా.. తాము సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామని, మళ్లీ లాక్​డౌన్‌ కొనసాగించి అనుమతులు రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపించాలని, లేదంటే తామే సొంతంగా వెళ్లిపోతామని చెప్పారు. తగిన అనుమతి పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.. అధికారులు వీరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:

వలస వ్యథలు.. కూలీల తిరుగు ప్రయాణం వెనుక కన్నీళ్లెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.