ఎంత చెప్పినా వినకుండా... మాస్కులు లేకుండా తిరిగే వారికి ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు చెక్ పెట్టనున్నారు. నేటి నుంచి పట్టణంలో బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని చెప్పారు. లేకుంటే 500 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే రూ. 500 చెల్లించాలని షరతులు విధించారు. దుకాణాల ముందు వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోతే యజమానికి 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: