ETV Bharat / state

కన్న కొడుకును ఎత్తుకోకుండానే.. కాటికి వెళ్తున్నాడు! - ప్రకాశం జిల్లా దర్శిలో కాలువలో పడి అజేయరెడ్డి మృతి న్యూస్

విషాదానికి సమయమంటూ.. ఉండదు. ఏదో సంతోషంలో ఉంటే.. ఆకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఒక్కసారిగా.. నవ్వింది చాలు.. ఇక ఏడ్చేయి అంటూ.. వెక్కిరిస్తుంది. మెుత్తం కుటుంబాన్నే.. కన్నీరు పెట్టిస్తుంది. కొడుకు నిన్ననే పుట్టాడా?... భర్త చనిపోయిన విషయం.. భార్యకు తెలియదా?... ఇవన్నీ విషాదానికి అవసరం లేదు. చీకటితో ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నాం చేయడమే తెలుసు.. అలా జరిగిన కథే ఇది.

man fell down into canal and died in prakasham district mundlamuru

author img

By

Published : May 28, 2020, 7:00 PM IST

నిన్ననే కొడుకు పుట్టి.. ఆ పిల్లాడి తండ్రి చనిపోతే.. ఆ విషయం మృతుడి భార్యకు తెలియపోతే. అది వినేందుకే.. మనసు కలుక్కుమంటోంది. ఘటన జరిగిన ఇంట్లో విషాదమెంతో? ఆలోచనలకు అందనంతా... ఊహకు తెలియనంతా. భర్త చనిపోయాడనే.. విషయం.. భార్యకు చెప్పెదేలా? అప్పుడే పుట్టిన బిడ్డతో ఆస్పత్రిలో ఆనందంగా ఉంది. భర్త చనిపోయాడనే.. చేదు నిజం తెలిస్తే.. ఆ తల్లి ఎంత తల్లడిల్లుతోంది. ఆమె పరిస్థితి ఊహించగలమా?

ప్రకాశం జిల్లా, దర్శిమండలం, అబ్బాయిపాలానికి చెందిన పిట్టం అజేయరెడ్డి, శివమణికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్ని రోజుల క్రితమే.. పురిటి నొప్పుల రాగా .. దర్శిలోని ఓ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నిన్న శివమణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టాడనే.. వార్తతో ఆ ఇంట్లో ఆనందం అంతా ఇంతా కాదు. ఆస్పత్రికి వచ్చి.. కొడుకును తనివి తీరా చూసుకున్నాడు అజేయరెడ్డి. అవే ఆఖరి చూపులు అవుతాయని తెలియదు పాపం తనకు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. తన కొడుకు గురించి.. పదే పదే చెప్పాడు. కొడుకు గురించి చెప్పిన ఆ మాటలే ఆఖరి మాటలయ్యాయి.

అదే ఆనందంలో స్నేహితులతో కలిసి.. ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్ వద్ద సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లాడు. ప్రమాద వశాత్తు.. కాలువలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం అజేయరెడ్డి భార్యకు.. తెలియనివ్వలేదు. తెలిస్తే.. ఆస్పత్రిలో ఉన్న ఆమె వెక్కి వెక్కి ఎడిస్తే.. ఏం అవుతుందోననే భయం. తనకు తోడు.. బిడ్డకు తండ్రి.. లేడని .. నిజం ఎలా జీర్ణించుకోగలదు పాపం.

ఇదీ చదవండి: శ్మశానంలో మృతదేహం.. హత్యా..? ఆత్మహత్యా..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.