ETV Bharat / state

బ్లాక్ ఫంగస్‌తో మార్కాపురం వాసి మృతి - Black fungus cases in ap

Man died in black fungus
బ్లాక్ ఫంగస్‌తో మార్కాపురం వాసి మృతి
author img

By

Published : May 18, 2021, 12:40 PM IST

Updated : May 18, 2021, 3:02 PM IST

12:37 May 18

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ భాషా అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్​తో మృతి చెందారు. ఇరవై రోజుల కిందట కొవిడ్ సోకడంతో వైద్యశాలలో చేరి కోలుకున్నారు. అయితే ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో బ్లాక్ ఫంగస్​కు గురైనట్లు వైద్యులు తెలిపారు. బాషాను ఒంగోలు ఆస్పత్రిలో చేర్పించగా...మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. మార్కాపురానికి చెందిన ఆరుగురు ఇప్పటికే బ్లాక్ ఫంగస్​తో చికిత్స పొందుతున్నారు. ఈయన మృతితో జిల్లాలో రెండో మరణం నమోదైంది.

ఇదీ చదవండి:

బ్లాక్​ ఫంగస్​: లక్షణాలు.. నిర్ధరణ.. చికిత్స ఏంటంటే?

Last Updated : May 18, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.