ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో వివాహేతర సంబంధం ఓ పసివాడిపై హత్యాయత్నానికి దారితీసింది. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని మూడేళ్ల బాలుడిపై మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి యత్నించాడు. ఈ క్రమంలో బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు వచ్చి రక్షించి.. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు తల్లిని, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది చదవండి నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకేజీ.. ఒకరు మృతి